సచివాలయంలో పనిచేసే చిరుద్యోగులతో పోటీగా అంగన్వాడీ సెంటర్లను తూతూమంత్రంగా నడుపుతోందని రైతుసంఘం దరిశి డివిజన్ కార్యదర్శి సందు వెంకటేశ్వరరావు విమర్శించారు.
సచివాలయం చిరుద్యోగులతో సెంటర్లను నడపటానికి నిరసనగా దరిశి సిడిపిఓ ఆఫీసు వద్ద నుండి అంగన్వాడీలు,ఆయాలు ప్రదర్శనగా వచ్చి దరిశి నగరపంచాయితీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.ఈసందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీలు 19 రోజులుగా కనీస వేతనాలు,రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ చెల్లింపు వంటి న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తుంటే ఇతర డిపార్ట్మెంట్ లలో చిరుద్యోగులుగా పనిచేస్తున్న సచివాలయం,విఓఏ, వాలంటీర్లు మున్సిపల్ సిబ్బందితో సెంటర్ల తాళాలు పగులగొట్టి సెంటర్లు నడిపిస్తున్నారని, ప్రభుత్వం తాళాలు పగుల కొట్టలేదని మంత్రి బొత్స ప్రకటించారని , అంగన్ వాడీలు తాళాలు పగుల కొట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఇంత చేస్తున్న ఎక్కడా …బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పుడ్ అంధించడం లేదని , తాళాలు తీసి ఫోటోలు అధికారులకు పంపడం మాత్రమే జరుగుతుందని సెంటర్లు మూతబడతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరారు.నాణ్యమైన సరుకులు, గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందజేసేందుకు బడ్జెట్లో నిధులు పెంచాలని అన్నారు.సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలను అంగన్ వాడీలు తిప్పికొట్టాలనికోరారు.
అనంతరం కమిషనర్ గారు లేకపోవటంతో అంగన్వాడీలు ఆర్.ఐ.వెంకటేశ్వర్లు కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షురాలు ఎ.తిరుపతమ్మ, అచ్చమాంబ,సుబ్బరత్నం,విశ్వవాణి, లక్ష్మి,వెంకటరమణ, బాలమ్మ, నాగమణి, సుజాత,నాగమల్లేశ్వరి,పిఎన్ ఎమ్ నాయకులు ఉప్పు మోహనరావు, ఈమని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


