చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణ పట్ల డీపీవో అసంతృప్తి

విఠలాపురం గ్రామపంచాయతీరమణాల వారి పాలెం లో ని చెత్త నుండి సం పద తయారీ కేంద్రం నిర్వహణ సక్రమంగా లేక పోవటంతో డిపీవో అనుపమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాళ్ళూరు మండలంలోని విఠలాపురం పంచాయతీ పరిధిలోని రమణాలవారిపాలెంలో చెత్తనుండి సంపద కేంద్రాన్ని, విఠలాపురం ఎస్సీ కాలనీ, మంచి నీటిట్యాంక్ ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఒక క్రమ పద్ధతిలో కాకుండా అడ్డదిడ్డంగా చెత్తను పడేసి కాల్చి వేయటంతో పరిసరాలు అపరిశుభ్రంగా వుండటం పట్ల ఆ గ్రహాం వ్యక్తం చేశారు. చెత్త సంపద కేంద్రం నిర్మాణం జరిగినప్పటి నుండి చెత్త నుండి సంపద తయారు చేయటం మినహా అన్ని పనులు ఇక్కడే జరుగుతున్నట్లు ఉన్నాయని అసంతృప్తి చెందారు. చెత్త కేంద్రంపైఉన్న రేకులు కూడా దుండగులు తీసుక వెళ్లి వుండటాన్ని
గమనించారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ఈ కేంద్ర వైపు కన్నెత్తి చూసినట్లుగా లేదని, వినియోగంలోకి తీసుక రాకుండా మిన్న కున్నా డిప్యూటీ ఎంపీడీవోగా మీరు ఎమి చేస్తున్నారని ప్రశ్నించారు. వారం రోజుల్లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేసి వినియోగంలోకి
తీసుక రావాలని, చుట్టూ కంచె వేయాలని పంచాయతీ కార్యదర్శి ఐ.విరమణారెడ్డి, డిప్యూటీ ఎంపీడీవోవి. శ్రీనివాసరావులను ఆదేశించారు. విఠలాపురంఎస్సీ కాలనీలో సైడు కాలువలందు మురుగు నీరు నిల్వ వుండటంపై అసంతృప్తి చెంది ఇప్పటి వరకు గ్రామంలో పారిశుధ్యపనులు జరిగినట్లు లేదని, తక్షణమే పారిశుద్యపనులు చేపట్టాలన్నారు. మంచినీటి ట్యాంక్ ను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా శుభ్రమైన స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో ఆమె వెంట డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు,టీడీపీ నాయకుడు నవులూరి విద్యాసాగర్ , పంచాయతీ కార్యదర్శి ఐ.వి.రమణారెడ్డి, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది తదితరులు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *