బేగంపేట సెప్టెంబర్ 21,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓల్డ్ కస్టమ్స్ బస్తీ కి తాగు నీరు విప్పాలంటే వాల్వు పైన పేరుకు పోయిన చెత్త ను తొలగించి నీటిని విప్పాల్సిన దుస్థితి. ఈ పరిస్థితి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో సనత్ నగర్ నియోజక వర్గం పరిధి లోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో నెలకొని ఉంది. ఈ పరిస్థితి నెలకొనడంతో బస్తీకి నీరు విడిచిన కొద్దిసేపు నీరు రంగు మారి రావడం,తీవ్ర దుర్వాసనతో వస్తున్నాయని బస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్తానిక బస్తీ వాసులకు ఎన్ని సార్లు చెత్తను ఇళ్ల వద్దకు వచ్చే ఆటోలకే ఇవ్వాలని అవగాహన కల్పించినా స్థానికులలో మార్పు రాకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం గా నిలుస్తున్నాయి.ఇప్పటికైనా స్థానికులు చెత్తను తాగు నీరు వాల్వ్ పైన చెత్త వేయవద్దని స్థానికులు నివాస గృహాల వారు కోరుతున్నారు.
