తాళ్లూరు : పంచాయితీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ నామినేషన్లు అడ్డుకున్నా, ఓటు హక్కుపై బెదిరింపులకు గురి చేసినా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చెయ్యాలని దళిత హక్కుల పరిరక్షణ నమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఎస్సీ, ఎస్టీ ఎన్నికల నియమాల కర పత్రాలను విడుదల చేసారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లపై దౌర్జన్యాలు చేసినా, ఓటు హక్కును అడ్డుకున్నా పోలీన్ కేసు నమోదు అయితే బాధితులకు ప్రభుత్వం రూ. 85వేల రూపాయలు రిలీఫ్ గా అందిస్తుందని అన్నారు. ఎన్నికల అధికారులు ఎన్నికల్లో పచ్చచొక్కాల అక్రమాలకు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లపై దౌర్జన్యాలకు ప్రేక్షక పాత్ర వహించకుండా సుమోటోగా కేసులు నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ రాజా బాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు లకు విజ్ఞప్తి చేసారు. ఎన్నికల కమీషన్ ఎస్సీ, ఎస్టీలు స్వేచ్ఛగా వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కొన్ని ప్రాంతాలలో నామినేషన్లు చెల్లకుండా, లేదా రిగ్గింగ్, లేదా అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చేలా చూసేవారని ఆన్నారు. కాని నేడు ఆంధ్ర ప్రదేశ్లో చెగువీరా న్పూర్తితో రాజకీయాలలోనికి వచ్చి స నాతన ధర్మం వైపు పయనిస్తూ సనాతన స్టార్ పవనిజం ప్రవేశ పెట్టి గతంలో తాను చెప్పిన కమ్యూనిజం, మార్కిజం. బహుజన వాదాలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను మోదీ కనునన్నల్లో చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. గతంలో రాయలసీమ మాత్రమే ఫ్యాక్ష్య నిజం ఉండేదని నేడు చంద్రబాబు వెన్నపోటు రాజకీయాలకు అంబాసిడార్ గా మారితే ప్రస్తుతం ఆయన తనయుడు లోకేష్ మన్సిపాలిటి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో పోలీస్ అధికారులను పంపించి నామినేషన్ వేసిన అభ్యర్థులను బెదిరించటం, నామినేషన్లు చించి వేయటం లోకేష్ ఇజంగా మారిందన్నారు. స్పందించాల్సిన హైకోర్టు కూడ అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలపై స్పందించక పోక పోవటం న్యాయవ్యవస్థ అధికార అక్రమాలపై గొడుగు పట్టటమే అన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, కార్యదర్శి కాకుమాను రవి, పట్రా బంగారం, కోలా జీవరత్నం, సాయి, మోషే, ప్రకాశం, ఏడు కొండలు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: