కురిచేడు : స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో, ప్రకాశం జిల్లా ఆణిముత్యం, విలక్షణ నటకిశోరం, దివంగత ప్రఖ్యాత నటుడు, దర్శకుడు,నిర్మాత అద్దంకి ముద్దు బిడ్డ యర్ర గిరిబాబు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా (IRCS)ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కపురం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అద్దంకి సీమలోని రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని తెలుగు సినిమా పరిశ్రమలో 650 పైచిలుకు సినిమాల్లో నటించి, వీటిలో 100 సినిమాల్లో కథానాయకుడి(హీరో )గా నటించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరుకున్న మన ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత నటుడిగానే గాకుండా, సినిమా పరిశ్రమలో అంచెలంచెలుగా దర్శకునిగా, నిర్మాతగా ఉన్నత స్థాయికి ఎదిగి, ఈ నెల 14వ తేదీన పరమపదించి ప్రజల హృదయాల్లో నిలిచారని కపురం తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ పోటీల లో ప్రజలకు మంచి సందేశం ఇచ్చే వారని, అందరికీ సన్నిహితులుగా ఉంటూ గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేసిన గిరిబాబు ను జిల్లా వాసులు ఎప్పటికీ మరచి పోరని, ఈ విధంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదిగాలని కోరారు.
నీటిని వృథా కాకుండా చూడాలని, పచ్చని చెట్లు నరకకూడదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: