ఒంగోలు : ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28న ఆరో తరగతి ప్రవేశానికి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నిర్వహి స్తున్నట్లు ప్రిన్సిపాల్ సి.శివరాం తెలిపారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్ష వివరాలను ఆదివారం తెలిపారు. ఈ నెల 28న శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందు చేరుకోవాలి. ప్రకాశం జిల్లావ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 5943 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు ఆన్‌లైన్ ద్వారా ఉమ్మడిగా అందించబడ్డాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్లు రాని వారు ఈ నెంబర్ కి 08592 – 281306 ఫోన్ చేయగలరు లేకపోతే ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం లో ఆఫీస్ నందు సంప్రదించాలన్నారు. ప్రవేశ పరీక్ష కందుకూరు, ఒలేటివారి పాలెం, సింగరాయకొండ, టంగుటూరు, చీమకుర్తి, ఒంగోలు, అద్దంకి, మార్టూరు, పర్చూరు, చీరాల, దర్శి, దొనకొండ పట్టణాల్లో 28 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వీటికి సంబంధించి ప్రతిచోటా సెంటర్ సూపరింటెండెంట్, సెంటర్ పరిశీలకులను నియమించారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్, ఆధార్ కార్డుతో పాటు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ సి. శివరాం తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: