మరణించిన పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుంది – ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మృతిచెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా నిలిచేందుకు పోలీస్ శాఖ తరఫున డెత్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ కారణాలతో మృతిచెందిన ఏడుగురు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు చెందిన సతీమణులకు ఒక్కొక్కరికి రూ.1,00,000/- చొప్పున మొత్తం రూ.7 లక్షల విలువైన జిల్లా డెత్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సంవత్సరంలో మృతిచెందిన పోలీస్ సిబ్బంది సీనవలి (G.No.2930), రమేష్ (G.No.1734), ప్రభాకర్ (G.No.2960), వి. శ్రీనివాసులు (G.No.1854), ఎస్.వి. రామారావు (G.No.453), రామకృష్ణ (G.No.784), నరసింహులు (G.No.3929).

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో లేదా వివిధ కారణాలతో మృతిచెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సిబ్బంది వేతనాల నుంచి ప్రతి నెలా సేకరించే మొత్తంతో అందించే ఈ చెక్కు పోలీస్ శాఖలోని ఐక్యత, పరస్పర సహకారానికి నిదర్శనమన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని బెనిఫిట్స్ త్వరగా అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామని,మృతిచెందిన సిబ్బంది కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏదైనా సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చునని వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ గారు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో RI సీతారామి రెడ్డి, ఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *