23న దర్శి మున్సిపల్ చైర్మన్‌గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం

దర్శి: దర్శి పురపాక సంఘం ప్రమాణస్వికరం నెల 23వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు దర్శి మున్సిపల్ చైర్మన్‌గా తన ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు, నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ , కడియాల లలిత సాగర్ , మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు , నారపుశెట్టి పిచ్చయ్య హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో ఉన్న పిజియన్ కాంప్లెక్స్‌లో బహిరంగ సభతో పాటు భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కావున దర్శి పట్టణంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దారం సుబ్బారావు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *