తాళ్లూరు: మండలంలో 16 పంచాయితీలలో 93 మంది సర్పంచిల, 430 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదం పొందినట్లు ఎంపీడీఓ, ఆర్ పి అజిత తెలిపారు. అందులో బెల్లంకొండ వారి పాలెం లో ఆరు సర్పంచిలు, దోసకాయలపాడులో పది, లక్కవరంలో ఐదు, బొద్దికూరపాడులో ఆరు, వెలుగు వారిపాలెంలో మూడు, నాగంబొట్ల పాలెంలో 13, తూర్పుగంగవరంలో ఆరు రామభద్రాపురంలో రెండు, మాధవరంలో నాలుగు, విఠలాపురంలో ఏనిమిది, తురకపాలెంలో రెండు, మన్నేపల్లిలో 8, తాళ్లూరులో 6, మల్కాపురంలో 6. కొర్రపాటి వారి పాలెంలో ఐదు, శివరామపురంలో మూడు నర్పంచిల నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ఎఆర్ చెప్పారు. విత్ డ్రా లు ఉండటంలో పలు గ్రామాలలో విత్ డ్రా ఉండటంలో పలు పంచాయితీలు ఏకగ్రీవాల వైపు వచ్చేటట్లు చెబుతున్నారు. అందులో వెలుగు వారి పాలెంలో వైసీపి చెందిన నామినేషన్లో మొదటి పేజీలో తప్పులు చూపి తిరష్కరించారని ఆగ్రామ వైసీపీ నాయకులు ఆరోపించారు. కాగా పలు గ్రామాలలో ఏకగ్రీవాలు చేసుకునేందుకు అధికార పార్టీ సామధాన దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాలలో వైసీపీ నాయకులు గ్రామాలను ఖాళీ చేసి అఘ్నాతంలోనికి వెళ్లారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: