తాళ్లూరు: వ్యాధులను ముందుగా గుర్తించి సకాలంలో నివేదించటం, నిరంతరం పర్యవేక్షణ చేపట్టం ద్వారా ప్రజా రోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయ్యాలని జిల్లా వ్యాధుల నిఘా అధికారి డాక్టర్ ఎన్ వాణి, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డి విక్టర్ బాబు అన్నారు. మండలంలో తూర్పుగంగవరం, తాళ్లూరు పీహెచ్సీలను వారు శుక్రవారం సందర్శించారు. తురపాలెం ను క్షేత్ర స్థాయిలో సందర్శించి ఇంటింటి జ్వర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి నమోదు చెయ్యాలని సిబ్బందికి సూచించారు. ఆయా పీహెచ్సీలలో జౌట్ పేషేంట్స్ రిజిస్టర్, కుక్కకాటు టీకాలు, పాము కాటుకు ఉపయోగించే విరుగుడు మందు నిల్వలను పరిశీలించారు. పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు చేసారు. ఆయా కార్యక్రమాలలో తాళ్లూరు, తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ మౌనిక, డాక్టర్ రాజేష్ యాదవ్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: