బాలికల భధ్రతకు రక్షణ చట్టాలు అండగా ఉండాలి – జిల్లా న్యాయ పర్యవేక్షణ అధికారి బి రత్న ప్రసాద్

తాళ్లూరు: బాలికలు తమ హక్కులు రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ పర్యవేక్షణ అధికారి బి రత్నప్రసాద్ కోరారు. స్థానిక కస్తూరిభా గాంధీ విద్యాలయంలో శుక్రవారం బాలల హక్కులు వారోత్సవాలను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఏ. పద్మ సునంద ఆదేశాల మేరకు విద్యాశాఖ , డిబిఆర్సీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డిబిఆర్నీ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికలు తమ హక్కులు, రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం, బాలల హక్కులు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, లైంగిక వేధింపుల నిరోధం, సైబర్ నేరాలపై జాగ్రత్తలు తదితర అంశాలను విద్యార్థినులకు వివరించారు.
బాలికలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడినా, బెదిరింపులకు గురిచేసినా విషయాన్ని దాచిపెట్టకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 వంటి సహాయ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఎంఈఓ జి నుబ్బయ్య మాట్లాడుతూ బాలకలు విద్యను మధ్యలో నిలిపి వేయకుండా ఉన్నత విద్యవైపు ప్రొత్సహించాలని బాలికల భధ్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టి బాధ్యత వహించాలని పేర్కోన్నారు. జిల్లా కెనారా బ్యాంకు ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ నీహెచ్ సాయి కుమార్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో పొదుపు చేయటం, ప్రభుత్వం అందించే వివిధ ఆర్థిక పధకాలు సద్వినియోగం చేసుకోవటం, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. కస్తూరిభా ప్రిన్సిపాల్, లెబర్ లైన్ ప్రతినిథి అంకం కిరణ్ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *