సికింద్రాబాద్, నవంబర్ 19 (జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు,
డాక్టర్ కోట నీలిమపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఓవైసీ వ్యాఖ్యలను నిరసిస్తూ సనత్‌నగర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రసూల్‌పుర చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. అసదుద్దీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఒక మహిళా నాయకురాలిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ హుందాతనానికి విరుద్ధమని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం ఓవైసీ రాజకీయ సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. రాజకీయ విమర్శలు ప్రజా సమస్యల చుట్టూ ఉండాలే తప్ప వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమం లో బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నసీరుద్దీన్ (అడ్డు ), రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షులు త్రికాల మనోజ్ కుమార్, ఇబ్రహీం పటేల్,పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: