హైదరాబాద్, నవంబర్ 19,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) : వేకప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ సేవలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం అభినందించారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, దేశాన్ని మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన
నషా ముక్త్ భారత్’ (మాదకద్రవ్యాల రహిత భారతదేశం) కార్యక్రమంలో వేకప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ చేస్తున్న సేవలను పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ సందర్భంగా వేకప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఇండో-కెనడియన్ న్యాయవాదిఅడ్వకేట్ సయ్యద్ నూర్ సంస్థ ఉపాధ్యక్షులుఅడ్వకేట్ మొహమ్మద్ ముదస్సిర్ జుహా, సంస్థ సభ్యులు అడ్వకేట్ జి. లలిత్ కుమార్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో వున్నారు.యువత, విద్యార్థులు,సాధారణ ప్రజల్లో
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు వేకప్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. సమాజాన్ని మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి రక్షించేందుకు సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అడ్వకేట్ సయ్యద్ నూర్ మాట్లాడుతూ, తమ సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సహించిన పోలీస్ కమిషనర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: