తాళ్లూరుః కూటమి ధర్మాన్ని కూటమి పక్షాలైన టిడిపి, జనసేన పాటించకుండా బిజేపిని బే ఖాతర్ చేస్తూ తమకు స్థానిక ఎన్నికలలో మెండి చెయ్యి చూపారని బిజేపి మండల పార్టీ అధ్యక్షుడు యర్రసాని విజయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై రవికుమార్ లు ఒక ప్రకటనలో ఆరోపించారు. కేవలం కూటమిలో టిడిపి, జనసేన లు మాత్రమే తాళ్లూరు మండలంలో స్థానిక సీట్లు పంచుకున్నారని, గత ఎంపీటీసీ ఎన్నికలలో అదే పంధాను కొనసాగించారని, ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలలో కూడ తమ పార్టీకి ఒక్క సీటు కూడ కేటాయించకుండా కూటమి ధర్మాన్ని పాటించటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే పంధాను కొనసాగిస్తే రాబోవు రోజులలో కూటమి ప్రభుత్వానికి తీరలేని బెబ్బ తగులు తుందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత కూటమి అధిష్టానం జోక్యం చేసుకుని కూటమి ధర్మాన్ని పాటించాలని హితవు చెప్పారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: