బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో భారీ అవగాహన ర్యాలీ.

బేగంపేట్, నవంబర్ 19, (జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
బేగంపేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS యూనిట్ – 5 ఆధ్వర్యంలో గురువారం జాతీయ సమైక్యతా దినోత్సవం (ఖౌమీ ఏక్తా దివస్) సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ మరియు ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ Professor పద్మావతి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.పద్మావతి మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా యువత దేశ ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. NSS యూనిట్-5 ప్రోగ్రాం ఆఫీసర్స్ A. రజని, సుప్రియ, కిషన్, వెంకటేశ్వర్లు
ఆధ్వర్యంలో సుమారు 500 మంది వాలంటీర్లు ప్లకార్డులు పట్టుకుని “భిన్నత్వంలో ఏకత్వం – మన భారతదేశపు గొప్పతనం” అంటూ నినాదాలు చేస్తూ స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.
ర్యాలీ అనంతరం కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మృదుల అధ్యాపకులు ప్రొఫెసర్ అనిషేరోన్, పర్వీనసుల్తానా, NSS వాలంటీర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *