తాళ్లూరు: మండలంలో పలు ఆలయాలలో శుక్రవారం భక్తి శ్రర్థలతో ప్రబోధిని ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొద్దికూరపాడులో శ్రీదేవి భూదేవి సమేత మాధవ దేవాలయంలో ఏకాదశి వేడుకలు భక్తి శ్రర్థలతో నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి మండపం చుట్టూ 365 ఓత్తులతో దీపారాధన చేసారు. సంవత్సరం కాలంలో ఉండే రోజులకు అనుగుణంగా ఈ దివ్యకాంతులతో కూడిన వత్తులతో దీపదర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ పూజాని వాను చెప్పారు. భక్తులకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: