59’వ భారత జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా (IRCS) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి మరియు మానవత స్వచ్చంద సేవా సంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను వుద్దేశించి కపురం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…… చినిగిన చొక్కానైనా వేసుకో కాని, ఓక పుస్తకం కొనుక్కొమనీ విద్యార్థులకు తెలిపారు. మనిషి జీవితంలో అబివృద్దికి పుస్తకం అనేక విధాలుగా దోహద పడుతుందన్నారు. అనంతరం వారోత్సవాల ను పురస్కరించుకుని గత రెండు రోజులుగా విద్యార్థులకు ఆటలు, చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో వక్తలు గ్రంథాలయ ఆవశ్యకత ను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు విజయ కుమారి, జూపల్లి కోటేశ్వరరావు, కవి అట్లురీ రామారావు, ఉపాద్యాయులు డేవిడ్, సుధాకర్, భూషణ రావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: