దర్శి: దర్శి పురపాలక సంఘం పాలక వర్గం 2021-2026 ఐదు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , దర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యని, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లను సన్మానించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, దర్శి మున్సిపల్ నూతన చైర్మన్ దారం సుబ్బారావు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, దర్శి మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్ రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: