హైదరాబాద్ నవంబర్ 22(జే ఎస్ డి ఎం న్యూస్ )
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్ర ఇన్‌చార్జ్ గద్వాల్ విజయలక్ష్మి హాజరుకానున్నారు.
సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ హోదాలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు, డివిజన్, మండలాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాలకు స్టేట్ ఇంచార్జ్ కావడంతో గద్వాల్ విజయలక్ష్మి సోమవారం హైదరాబాద్ జిల్లా ప్రజావాణికి హాజరు కానున్నారు.ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులు, అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు సమర్పించే వినతులను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు జారీ చేయనున్నారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత పత్రాలతో సోమవారం ఉదయం 10.30 గంటలకు లక్డికాపూల్ లోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: