బేగంపేట నవంబర్ 22(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
అంతర్ కళాశాల ఖో-ఖోటోర్నమెంట్లో బేగంపేట మహిళా కళాశాల జయకేతనం ఎగుర వేసింది.లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాల ఖో-ఖో టోర్నమెంట్లో బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. టోర్నీ ఆద్యంతం క్రీడాకారిణులు అద్భుత ప్రతిభ, సమిష్టి కృషితో విజేతలుగా నిలిచి కళాశాలకు పేరు తెచ్చారు.
విజేత జట్టును కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. పద్మావతి, వైస్ ప్రిన్సిపాల్ డా. మృదుల, అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థినులను క్రీడల్లో ప్రోత్సహిస్తూ, సరైన మార్గదర్శకత్వం అందించిన వ్యాయామ విద్యా విభాగాధిపతి డా. పి. సుప్రియను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా ప్రశంసించారు. క్రీడాకారిణులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కళాశాల యాజమాన్యం ఆకాంక్షించింది.

Save or share this story as a newspaper-style Epaper Clip: