బేగంపేట నవంబర్ 22,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
రెండు చుక్కలు పోలియో చుక్కలు వేయించి చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించి, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రకాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్గా కరుణాకర్ అన్నారు. ఆదివారం డివిజన్లోని
భగ వంతాపురం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చిన్నారుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన డివిజన్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం ఇన్చార్జి శారద, ఆశా వర్కర్ సంపూర్ణ, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: