హైదరాబాద్, నవంబరు 22 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఒక్కరోజు చేపట్టిన
ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 288 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 241 మంది బైక్ రైడర్లు, 12 మంది ఆటో డ్రైవర్లు, 34 మంది కార్ డ్రైవర్లు, ఒక హెవీ వెహికల్ డ్రైవర్ ఉన్నారు. బీఏసీ పరీక్షల్లో 231 మందికి 36 నుంచి 200 ఎంజీ, 37 మందికి 201 నుంచి 300 ఎంజీ, మరో 20 మందికి 301 నుంచి 550 ఎంజీ వరకు ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన 288 మందిని కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: