హైదరాబాద్ నవంబర్ 22(జే ఎస్ డి ఎం న్యూస్ )
ఈ నెల 24వ తేదీ (మంగళవారం) జరగాల్సిన సీ ఎం ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా దీనిని నవంబర్ 27వ తేదీ (శుక్రవారం) కి మార్చినట్లు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, మంగళవారానికి బదులుగా శుక్రవారం నాడు కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన సూచించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: