ఒంగోలు నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న వ్యభిచార కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మపాలెం ప్రాంతం, దినాల బావి పక్క రోడ్డులో ఉన్న ఒక వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ చెంచయ్య మరియు సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు విటులు పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. నిర్వాహకురాలు మహిళ పరారీలో ఉంది. పట్టుబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: