తాళ్లూరు: పాల ఉత్పిత్తి పెరుగుదలకు యజమానులు పశువుల ఆరోగ్యంపై శ్రర్ధ చూపటం ఎంతో ముఖ్యమని ఒంగోలు ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం రత్న మంజుల అన్నారు. లక్కవరం గ్రామంలో ఆత్మ, జిల్లా వనరుల కేంద్రం సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ రత్న మంజుల మాట్లాడుతూ దూడల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలని కోరారు. తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి పి వంశీ మాట్లాడుతూ పశువులకు ప్రతి రోజు తాగు నీటిని శుభ్రంగా అందించటంతో పాటు పోషణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ఏరువుల కొనుగోలు నమయంలో ఎఫ్ ఎఫ్ ఎన్ యాప్ను ఉపయోగించుకుని ఎరువులు పొందాలని, రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు భీమా చేయించుకోవాలని కోరారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: