బేగంపేట నవంబర్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్ ) ;
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టి. శ్రీహరి, మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి లను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. బేగంపేట డివిజన్ కు చెందిన శ్రీహరి సోదరుడు సుధాకర్ గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వారి నివాసానికి వెళ్లి సుధాకర్ పార్ధీవ దేహంపై పూలమాల వేసినివాళులర్పించారు. అనంతరం శ్రీహరి ని, ఇతర కుటుంబ సభ్యులనుపరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ నాయకులు కె.కిషోర్, అఖిల్, నాగరాజు గౌడ్, ఆరీఫ్ తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: