పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రక్రియ పురోగతిపై ఆయన ఆరా తీశారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి హాజరయ్యారు. అర్హత ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో స్థానం పొందని వారికి అవకాశం, ఓటరు చిరునామా మార్పు, చని పోయిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, బిఎల్ఓ తో బుక్ చేసుకున్న కాల్ పరిష్కరించడంలో జిల్లా పురోగతిని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. మొత్తం కలిపి సుమారు 6వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. వీటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఈఓ కు తెలిపారు. ఈ దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సంతనూతలపాడు ఈఆర్వో మాధురి, కొండపి ఈఆర్ఓ రవికుమార్, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: