దర్శి పట్టణం లో పొదిలి రోడ్ లోని పి.జి.యన్. కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన దర్శి పురపాలక సంఘం నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ సభ ఘనంగా నిర్వహించారు . ముఖ్య అతిధిలు గా దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారాపుశెట్టి పాపారావు పాల్గొని ప్రసంగించారు .
దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ .. మూడేళ్ల ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కృషి ఫలితమే నేడు ఎన్నికలలో ప్రజలందరూ కూటమి వైపు నిలబడ్డారని అన్నారు . అందుకే ఏకపక్షంగా ఏకగ్రీవంగా దర్శి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి పార్టీలు టిడిపి-జనసేన-బిజెపి మద్దతుతో మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు ఎన్నికవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు . ఆనాడు ప్రజలు నన్ను ఓడించిన.. మీరు గెలిస్తే నేను గెలిచినట్టేనని ప్రజలకు నేను చెప్పిన మాట నిజం చేశారుని ప్రజలు మాట నిలబెట్టుకున్నారని అన్నారు .
ఇక మనం పాలకులుగా మన మాట మనం నిలబెట్టుకోవాలని , ఇప్పటికే దర్శి నగర పంచాయతీగా ఉన్న పట్టణాన్ని మున్సిపాలిటీగా చే సామని , మూడేళ్లలో దాదాపు 20 కోట్ల రూపాయలతో అనేక మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తున్నామని రోడ్లు, డ్రైన్లు, లైటింగ్, పార్కుల అభివృద్ధి మంచినీటి వసతి ఇలా అభివృద్దే అజెండాగా మనం ముందుకు వెళ్లాం మని , టీటీడీ కళ్యాణ మండపం, అన్న క్యాంటీన్ నిర్మాణం, మినీ స్టేడియం, క్రికెట్ స్టేడియం ఇలా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు . పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా మన ప్రభుత్వం మూడేళ్లలో అడుగులు వేసిందని , అమృత పథకం కింద ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నామని ఇలా మన అభివృద్ధి ప్రభుత్వంలో ప్రజలు ప్రభుత్వం వైపు అండగా ఉండి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మన వైపు ఉండబట్టే దారం సుబ్బారావు ఎన్నికయ్యారని దారం సుబ్బారావు ఎన్నిక ప్రజా విజయంగా కూటమి ప్రభుత్వ విజయంగా చెప్పవచ్చుని అన్నారు . దారం సుబ్బారావు , నారపుశెట్టి పిచ్చయ్య గతంలో మున్సిపల్ చైర్మన్ గా చేసి ఉన్నారు ఆయన అనుభవాలను తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు .
ప్రజలకు మనం ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రతి వార్డులో ప్రతిరోజు ప్రజల సమస్యలు గుర్తిస్తూ ప్రజలతో మమేకమై పనిచేయాలని మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ హితవు తెలిపారు. అవినీతి రహితంగా ప్రజా పాలన కొనసాగించాలని వచ్చే పదిహేనేళ్లు దర్శిలో కూటమి తెలుగుదేశం జెండా ఎగరాలని ఆమె పిలుపునిచ్చారు. ఇదే ఉత్సాహం, ఇదే స్ఫూర్తితో జరిగిన పొరపాటున సరిదిద్దుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాను దర్శిలో ఎగరవేయాలని ఆమె కోరారు.
దారం సుబ్బారావు విజయానికి సహకరించిన కూటమి నాయకులందరికీ పేరుపేరునా మరొకసారి కృతజ్ఞతలు చెప్పారు . మరింత రెట్టింపు ఉత్సాహంతో నాయకులు కార్యకర్తలుప్రజల ఆకాంక్షలకు అనుగొనంగా నూతన పాలకవర్గం పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు.
దర్శిలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అరాచకం పోయింది అభివృద్ధి వచ్చింది. ఇది చూసి ఓర్వలేని వైసిపి నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అప్పుడప్పుడు విజిటర్ గా వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి నిందారోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు . మీరు చేసే పనులు ఎదుటి వారిపై రుద్దుతున్నారని , నిన్న జరిగిన ఎన్నికల్లో ఎస్సై పై దాడి చేసింది ఎవరు? వెంకటాచలం పల్లి లో కారం చల్లింది ఎవరు? దాడులకు దిగింది ఎవరు? ప్రజలు గ్రామాభివృద్ధికి ఏకగ్రీవాలు చేసుకుంటే ఉనికి కోల్పోతామని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి మీది మాది అభివృద్ధి ప్రభుత్వం. అభివృద్దే మా ఎజెండా, కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన అభివృద్ధి ఏమిటో మీరు చూస్తున్నారు. మీరు మూడుసార్లు మీ కుటుంబంలో ఎమ్మెల్యేగా గెలిచి దర్శికి ఏం చేశారని సవాల్ విసిరుతున్నానని , మేము వచ్చాక చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు డిగ్రీ కాలేజీ నిర్మాణం, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తిరిగి పనులు ప్రారంభం, రైతు బజార్ ఏర్పాటు, 100 కోట్లకు పైగా వేయంతో ఇంటింటికి కుళాయిల నిర్మాణం, 20 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన ఇలా అభివృద్ధి ఎజెండాగా మా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ……..మీరు లోకల్ అన్నారు …..మీరు లోకల్ లో ఉండరు……….. బెంగళూరు, హైదరాబాదులో ఉంటూ చీమకుర్తిలో ప్రచారాలు చేస్తూ దర్శిలో ప్రజలను రెచ్చగొట్టే సంస్కృతి మీదని ఆరోపించారు .
నేను దర్శి లో ఎన్ని రోజులు ఉన్నాను ……మీరు ఎన్ని రోజులు ఉన్నారు. మీరు వారానికి ఎన్ని రోజులు వస్తున్నారు…… ప్రజలందరూ చూస్తున్నారని , ఇప్పటికైనా నేను సవాలు విసురుతున్నానని దర్శిలో సంవత్సరంలో ఎవరు ఎక్కువ రోజులు ప్రజలతో ఉంటారు ……ప్రజల సమస్యలు తీరుస్తారో తెలుసుకుందాం చూద్దాం అని , ఇప్పుడు నుంచి లెక్కలు వేసుకోమనండి, ఆ లెక్కలేదో చెప్పండి అంతేగాని మీరు చేసే అరాచకాలు మా కూటమినేతలపై, కార్యకర్తలపై బురద చల్లద్దని అన్నారు .
2024 ఎన్నికల్లో అరాచకం చేసి గెలిచారని .. బలమైన తెలుగుదేశం ఉన్న దర్శిలో స్థిరమైన నాయకత్వం లేక ఇప్పటివరకు డీలాగా ఉన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గొట్టిపాటి లక్ష్మి అండ దండగా నిలుస్తుందని అన్నారు . వచ్చే ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది నేను భరోసా ఇస్తున్నా అని …. మీ కు నేనున్నాను నాకు మీరు అండగా ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా దర్శిలో రెపరెపలాడుతుందని ఆమె భరోసా ఇచ్చారు . నారపుశెట్టి కుటుంబంతో నాకున్న అనుబంధం చాలా గొప్పదని…… నాకు అడుగడుగున అండగా ఉన్నారని నిలిచారని ….పెద్దలు పాపారావు , మాజీ చైర్మన్ పిచ్చయ్య ఏ సమస్య వచ్చినా నాతోపాటు ఉండి ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుండి నడిపించారని తెలిపారు . పార్టీకి అండగా ఉన్న ఎవరికైనా ఏదో ఒక సమయంలో న్యాయం జరుగుతుందని నిదర్శనమే కూటమి పొత్తులలో జనసేన నుండి దారం సుబ్బారావు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇదే స్ఫూర్తితో గ్రామపంచాయతీలలో అభివృద్ధి ఎజెండాగా ఏకగ్రీవాలు కావడం ఒక శుభ పరిణామని అన్నారు . ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం అభివృద్ధిని ముందుకు నడిపిద్దామని అన్నారు . నేను మాట ఇస్తున్నాను ఇక దర్శి దశ దిశ మార్చి సుందరమైన దర్శిని చూద్దామని …. . మహిళలకు ఇబ్బందులు లేకుండా టాయిలెట్లు నిర్మిద్దామని…… ఈ సందర్భంగా ఆ మాటిస్తున్నానని , వ్యాపారస్తులు కూడా చెత్త తొలగింపును స్వచ్ఛందంగా చేపట్టాలని కోరుతున్నానని అన్నారు . క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా దర్శిని రూపుదిద్దేందుకు నూతన పాలకవర్గం కలిసికట్టుగా ప్రజలందరి అవసరాలను రాజకీయాలకతీతంగా పరిష్కరించి ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో మమేకమై పనిచేయాలని డాక్టర్ లక్ష్మి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో దర్శి నియోజకవర్గం లోని మండల టిడిపి, బీజేపి, జనసేన పార్టీల అధ్యక్షులు, నూతన ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, ఎంపీటీసీ లు, నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బీజేపి నాయకులు, కార్యకర్తలు, మహిళాలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.










Save or share this story as a newspaper-style Epaper Clip: