ఇఫ్తేఖార్‌ షరీఫ్‌ నివాసంలో ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం.

హైదరాబాద్ సెప్టెంబర్ 21 (జె ఎస్ డి ఎం న్యూస్) :
భారత తొలి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), ప్రముఖ వ్యాపారవేత్త, దాత ఇఫ్తేఖార్ షరీఫ్ నివాసంలో పలువురు ప్రముఖులతో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ భేటీకి తెలంగాణ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, బీహార్ మంత్రి జమా ఖాన్, ఇండో-కెనడియన్ న్యాయవాది, ‘వేక్ అప్ హ్యూమానిటీ ఆర్గనైజేషన్’ అధ్యక్షుడు అడ్వకేట్ సయ్యద్ నూర్, న్యాయవాది ముధసిర్ జుహా ,ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ అజహర్‌లు హాజరయ్యారు.
ఎంతో సుహృద్భావ వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో నేతలు, ప్రముఖులు పరస్పరం ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. సమాజ సంక్షేమం, విద్యాభివృద్ధి, సామాజిక పురోగతితో పాటు మానవతా దృక్పథంతో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై వారు విస్తృతంగా చర్చించారు. స్నేహం, పరస్పర సహకారం, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సాగిన ఈ భేటీ పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *