దర్శిలో గ్రంథాలయంలో పుర ప్రముఖులు,కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారుల కు ఘన సన్మానం

దర్శిలో గ్రంథాలయంలో, 59’వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా, గ్రంథ పాలకురాలు వంగా విజయ కుమారి ఆధ్వర్యంలో దర్శి పుర ప్రముఖులు,కవులు, రచయితలు,సాహితీవేత్తలు, కళాకారుల సమక్షంలో ప్రముఖ సంఘ సేవకులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా (IRCS)ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి మరియు మానవత స్వచ్చంద సేవా సంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డిని దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జూపల్లి కోటేశ్వరరావు, రచయిత మరియు ఆధ్యాత్మిక ప్రభోధకులు గువ్వల పద్మనాభరెడ్డి,ప్రముఖ పురావస్తు శాసనాల పరిశోధకులు తురిమెళ్ళ వెంకట శ్రీనివాస ప్రసాద్ శర్మ, క్రైస్తవ మత ప్రబోధకులు,రచయిత రెవరెండ్ డాక్టర్ దాసరి సాధు మోహన్, ముస్లిం మత ప్రబోధకులు ముక్తి మహామ్మద్ షాహిద్, ఉప కారాగారం సిబ్బంది శ్రీనివాస రెడ్డి, సుబ్బారెడ్డి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని, మానవత స్వచ్చంద సేవా సంస్థ ద్వారా సమాజంలో ఎలాంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా, రాజకీయాలకు,కులాలకు, మతాలకు అతీతంగా చివరి మజిలీ(అంతిమ యాత్ర)లో ఎవరూ చేయని,చేయలేని మహోన్నత కార్యక్రమం చేస్తున్న కపురం శ్రీనివాసరెడ్డి ఆదర్శప్రాయుడని,
ఆయన చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *