ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రెండవ విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల-2026 సంబంధించి, అభ్యర్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థుల సౌలభ్యం కోసం, ఆర్డీవో (RDO) కార్యాలయాలు మరియు ఎంపీడీవో (MPDO) కార్యాలయాల్లో అదనపు / ప్రత్యామ్నాయ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేథా అనుమతి మంజూరు చేశారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి మేరకు, ఎస్పీ నుంచి అందిన నివేదికను పరిశీలించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సంబంధిత అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
Save or share this story as a newspaper-style Epaper Clip: