తాళ్లూరు: శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి రాజా బాబు, ఎస్పీ వి హర్షవర్థన్ రాజు అన్నారు. తాళ్లూరు మండలంలో విఠలాపురం, తాళ్లూరు నామినేషన్ కేంద్రాలను గురువారం అకస్మిక తనిఖీ నిర్వహించారు. నామినేషన్ జరుగతున్న విధానాన్ని, అక్కడ పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీన్ అధికారులు తీసుకోవాల్సిన చర్యల గురించి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100, 200 మీటర్ల పరిధిలో నిబంధనల మేరకు పోలీసు ఆంక్షలు అమలు చేస్తూ పోలీస్ యాక్ట్ 30, బి ఎన్ ఎన్ ఎన్ సెక్షన్ 163 ప్రకారం నిషేదాజ్ఞలు అమలు చెయ్యాలని సూచించారు. నామినేషన్ కేంద్రా పరధిలో నిరంతరం నిఘా ఏర్పాటు చేయటం తో పాటు డ్రోన్ కెమోరాలతో పరిస్థితులను పర్యవేక్షించాలని చెప్పారు. కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి కదలికను నిశితంగా పరిశీలించాలని కోరారు. నామినేషన్ ప్రక్రియలో ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన తావు లేకుండా, ఆటంకాలు లేకుండా ప్రతి అభ్యర్ధి తన నామినేషన్ స్వేచ్చగా దాఖలు చేసుకునే విధంగా పోలీన్ యంత్రాంగం సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రశాతంగా జరిగేలా ప్రజలు, అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించాని కోరారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంట దర్శి డీఎస్పీ బాల మురళీ క్రిష్ణ, ఎన్ బి ఎం ఇన్స్ఫెక్టర్ శ్రీనివాస రావు, తహసీల్దార్ రమణా రావు, ఎంపీడీఓ అజిత, ఎస్పై మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: