తాళ్లూరు ఎంపీపీగా బొమ్మిరెడ్డి రమణమ్మ – ఘనంగా ఎంపీపీ ప్రమాణ స్వీకారణ మహోత్సవం

తాళ్లూరు: మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యుల ప్రమాణ స్వీకార మహోూత్సవం గురువారం మండల ప్రజా పరిషత్ ఆర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ దేవనహాయం, ఎంపీడీఓ ఎఆర్ ఓ అజిత ల ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికయిన ఎంపీటీసీ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు ఎంపీపీగా శివరామపురం ఎంపీటీసీ సభ్యురాలు బొమ్మిరెడ్డి రమణమ్మ, వైస్ ఎంపీపీగా లక్కవరం ఎంపీటీసీ వల్లెపు వెంకట నుబ్బారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొదటగా దోసకాయలపాడు, బొద్దికూరపాడు, తూర్పుగంగవరం-1, తూర్పుగంగవరం-2, లక్కవరం, మాధవరం, మల్కాపురం, మన్నేపల్లి, నాగంబొట్ల పాలెం, శివరామపురం, తాళ్లూరు-1, తాళ్లూరు-2, తురక పాలెం, వెలుగు వారి పాలెం ఎంపీటీసీ సభ్యులు కృష్ణం నాగేశ్వర రావు, దేవెండ్ల లక్ష్మి, యాడిక శ్రీకాంత్ రెడ్డి, బొల్లా నరేంద్ర పెద బాబు, వల్లెపు వెంకట సుబ్బా రావు, పాలెపోగు రవి అనపర్తి నంతోషం, గోల్లపాటి మేషిక్, వేడికోల చంద్రమ్మ, బొమ్మిరెడ్డి రమణమ్మ, కోట వెంకట లక్ష్మి, కాట్రెడ్డి విజయ, అన్నపురెడ్డి రమణ, ఆలూరి అక్కమ్మలను ఆర్జే దేవ సహాయం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా బొమ్మి రెడ్డి రమణమ్మ, వైస్ ఎంపీపీగా వల్లెపు వెంకట నుబ్బా రావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, ఉ పాధ్యక్షులు, సభ్యులకు ఆర్డీ, ఎంపీడీఓలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ కైపు నాగ లక్ష్మి, రామ కోటి రెడ్డి, టీడిపి టిడిపి శ్రేణులు మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, మాజీ ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మాజీ జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మానం రమేష్ బాబు, బడే, కైపు నాగార్జున రెడ్డి, నవులూరి సాగర్, కళ్యాణ్ చక్రవర్తి, వివిధ గ్రామాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని గజ మాలతో ఎంపీపీ దంపతులను సన్మానించారు. అభినందనలు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *