రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు – దర్శి ఎమ్మెల్యే డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

దర్శి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
దర్శి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా దర్శి మున్సిపల్ ఎన్నికలలో 300 మంది పోలీసులను, నరసరావుపేట నుండి జనాన్ని తీసుకొచ్చి భయాందోళన లకు గురి చేసి, నామినేషన్లు లాక్కొని చించివేసి మున్సిపల్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు.
ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో బేరసారాలకు దిగి, ప్రశాంతంగా జరిగే ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసి, గంజాయి , బ్లేడ్ బ్యాచ్‌ ల ను దించి నామినేషన్లు అడ్డుకోవడం, చించివేయడం లాంటి సంస్కృతి దర్శిలో చేస్తున్నారు అని ఆరోపించారు. గొట్టిపాటి లక్ష్మీ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వర్గ విభేదాలు, కలుషిత రాజకీయం చేయడం ఆపాలని కోరారు.
గొట్టిపాటి లక్ష్మీ పంచాయతీలలో రూ . 20 లక్షలు, రూ . 30 లక్షల రూపాయలకు బేరాలు పెట్టి సర్పంచ్ వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. దర్శిలో జరుగుతున్న పరిణామాలను ఎస్ఈసీ మరియు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అధికారులు స్పందించి మండల కేంద్రాలు మరియు ఆర్డీఓ ఆఫీస్ వద్ద నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారు. కావున రాబోవు రెండు రోజుల్లో సజావుగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేయాలని కోరారు .విలేకరుల సమావేశంలో రాష్ట్ర సీఈసీ మెంబర్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకట రెడ్డి, కాకర్ల కృష్ణా రెడ్డి, సుబ్బయ్య యాదవ్, చింతా శ్రీనివాస రెడ్డి, సూదిదేవర అంజయ్య, రత్న రాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవప్రసాద్, కేవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *