బేగంపేట సెప్టెంబర్ 22,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
డివిజన్ ప్రజలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చల్లగా కాపాడాలనీ బేగంపేట మాజీ కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి అన్నారు.బేగంపేట పరిధిలోని బ్రాహ్మణవాడి,భగవంతాపూర్ ,బర్ధన్ కాంపౌండ్,శ్యామ్ లాల్ బిల్డింగ్ గణపతి ఆలయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను మాజీ కార్పొరేటర్ దంపతులు దర్శించి పూజలు
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కమిటీల నిర్వాహకులు వారితో పూజలు నిర్వహింప జేశారు.అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించారు.తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్వరి శ్రీహరి మాట్లాడుతూ గణపతి నవరాత్రులతో బస్తీల్లో పండుగ శోభ నెలకొందని,నిమజ్జనం సమయంలో నిర్వాహకులు పోలీస్ అధికారులు సూచనల మేరకు నిమజ్జనం చేసుకోవాలన్నారు.మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని.యువత కూడా చేదు అలవాట్ల జోలికి వెళ్లకుండా భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు బీ ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.




