నాగులుప్పలపాడు ,జూలై 21 రిజిస్టర్ కార్యాలయాల్లో పనిచేసే డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి అడ్డుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు సంఘం నాయకులు ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆళ్ల నాగభూషణములు సంయుక్తంగా తెలియజేశారు మంగళవారం అమ్మనబ్రోలు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ జీవో వలన వేలాది మంది రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి అడ్డంకి ఆని ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం ఆర్ఎస్కే కార్యాలయాలు పెట్టాలని చూస్తున్నారని దీని ద్వారా మా జీవనోపాధి కోల్పోతుందని తక్షణమే జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అన్నం రాజు పాండురంగారావు, గొల్లపూడి శ్రీను ,ఆర్ వి రత్నం ,భీమవరపు సాయి ,చెన్నారెడ్డి ,సురేంద్ర తదితర డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు.
