మాదిగ మహిళపై దాడి కేసులో ముద్దాయి బాలిరెడ్డిని అరెస్ట్ చెయ్యాలి -దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం

తాళ్లూరు: బొద్దికూరపాడు రెస్టారెంట్లో పనిచేస్తున్న మహిళ మందా ఏనమ్మపై అధికారఅహంకారంతో దాడికి పాల్పడిన గంగిరెడ్డి బాలి రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం డిమాండ్ చేసారు. దర్శి డీఎస్పీ బాల మురళీ క్రిష్న కలిసి సంఘటన జరిగిన తీరుపై విచారం వ్యక్తం చేసారు. వారం రోజుల క్రితం బొద్దికూరపాడు విఆర్ రెస్టారెంట్లో బక్కిరెడ్డి పాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గంగిరెడ్డి బాలి రెడ్డి అక్కడ రెస్టారెండ్ యజమానితో పాటు పలువురిపై దురుసుగా ప్రవర్తించి టెబుల్ క్లీన్ చేస్తున్న మహిళను కూడ కులం పేరుతో దూషించి, బీరు సీసాతో తలపై దాడి చేసారని చెప్పారు. దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అనంతరం ఆమెను పరామర్శించామని చెప్పారు. రాజీకి రావాలని పలువురు నాయకులు ప్రయత్నించారని డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివారం తాళ్లూరు పోలీస్ స్టేషన్లో ఏనమ్మను దళిత నాయకుల సమక్షంలో డీఎస్పీ విచారించారు. ఎస్సై మల్లిఖార్జున రావు, సిబ్బంది, మాల మహానాడు అధ్యక్ష, కార్యదర్శులు దార అంజయ్య, కాకుమాను రవి, మాదిగ పరిరక్షణ సమితి నాయకులు పట్రా బంగారం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *