తాళ్లూరు: జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగా భవాని ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలోపాల్గొని చల్లగా చూడమ్మా గంగమ్మ తల్లి అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. దేవాలయ ట్రస్ట్ తరపున అన్నదాన సత్రంలో అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ సానే సురేష్, ఈఓ నారాయణ రెడ్డి, ఆర్ఎ ప్రసాద్‌లు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.
