ఉప్పుగుండూరు గ్రామం సర్వే నెంబర్ 78లో ఒక 1ఎకరా 50 సెంట్లు ప్రభుత్వ భూమిలోనే కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం చేపట్టాలని తెలుగుదేశం, జనసేన, బిజెపి,కూటమి పార్టీ నాయకులు కనగాల శ్రీనివాసరావు, బాలిశెట్టి నాగేశ్వరరావు, ఆత్మకూరు వాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. ఆదివారం ఉప్పుగుండూరు లో ఎన్టీఆర్ బస్టాండ్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యకర్తల సమావేశంలో ప్రతిసారి తెలుగుదేశం ,జనసేన పార్టీలలో వైసీపీ కోవర్టులు ఉన్నారని చెబుతున్న మాట నిజమేనని అది మన గ్రామంలోని తేటతెల్ల.మవుతుందన్నారు. గ్రామఅభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు తెలుగుదేశం ,జనసేన, పార్టీలలో కూడా విద్వేషాలు పెంచుతున్నారన్నారు,ఉప్పుగుండూరు గ్రామంలో సర్వేనెంబర్ 78 లో ప్రభుత్వ స్థలము ఒక 1ఎకరా 50 సెంట్లు 1940 వ సంవత్సరంలోనే అప్పటి దాతలు గ్రామంలో ప్రజాఅవసరాలకు దానంగా భూమిని ఇచ్చారన్నారు ఆ భూమిలోనే ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం చేపట్టేందుకు అన్ని మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయని వారు తెలియజేశారు. వైసీపీ ఎంపీటీసీ తో పాటు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆ భూమి సరిపోదని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలి, ఊరికి దూరంగా స్మశానాలు ఉండాలి కానీ ప్రభుత్వ ఆసుపత్రిని ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో లోతట్టు ప్రాంతం పెట్రోల్ బంకు, ధనియాల ప్రాసెస్ యూనిట్, రెండు బ్రాందీ షాపులు, ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణముకు మూడు ఎకరాలు దానం ఇస్తామని కొంతమంది వ్యాపారస్తులు ముందుకు వచ్చి వారు భూదానం ఇస్తామనటంలో కుట్ర దాగి ఉందన్నారు. ఆ పరిసరాల్లో వారు భూములు కొనుక్కొని ఆ భూములకు రేట్లు పెంచేందుకు ఊరికి దూరంగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని చూస్తే ఊరుకోమని వారు హెచ్చరించారు. గత కాంగ్రెస్,వైసీపీ , పార్టీలు అధికారంలో ఉన్న 2008, 2019 సమయాల్లో కూడా సర్వే నెంబర్ 78 లోనే వంద పడకలు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని అప్పుడు గ్రామపంచాయతీ తీర్మానం కూడా చేపట్టారని నేడుఆ భూమి చాలదని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆ భూమిలో పార్కు ఉందని ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్తున్న మాటలు అవాస్తమన్నారు. గ్రామంలో ఈపాటికి పార్కులు చాలా ఉన్నాయని హై స్కూలు, జూనియర్ కళాశాలలు విశాలమైన గ్రౌండ్లతో పాటు ఊరచెరువు ప్రాంగణలను పార్కుగా ప్రజలు వినియోగించుకుంటున్నారని ప్రత్యేకంగా పార్కు పేరుతో ఆసుపత్రికొరకు 50 ఏళ్ల క్రితం కేటాయించిన భూమి చాలదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని వారందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారన్నారు. గత సంవత్సరము ఫిబ్రవరి నెలలో స్థానిక శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్ సర్వేనెంబర్ 78 లోనే ప్రభుత్వఆసుపత్రి నిర్మాణం జరగాలని సిఫార్సు లేఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ఇచ్చారని దాని ఆధారంగానే ఆసుపత్రి నిర్మాణం కు ఫైల్ కరస్పాండింగ్ జరుగుతుందని కూటమి పార్టీ అధికారంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగితే ఆ పార్టీకి మంచి పేరు వచ్చిందని దీనిని ఓర్వలేక కుట్రలు చేస్తున్నారన్నారు. కొంతమంది స్వార్థపరులు తెర వెనుక ఉండి సహాయం చేస్తున్నారని వారు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవాలని తెలియజేశారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగ నాగార్జున గెలుపుకు డబ్బులు పంపిణీ చేసినవారు, రాఘవేంద్ర కాలనీ వద్ద పోలింగ్ బూత్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు పై ఘర్షణకు దిగినవారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అని చెప్తున్న వారు ఎన్నికల సమయాల్లో ఎవరి గెలుపు కోసం పని చేశారనేది ప్రజలకు తెలుసని ప్రజలే తగిన బుద్ధి వారికి చెప్పటం ఖాయమన్నారు. స్థానిక శాసనసభ్యులు బి.ఎన్ .విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం సర్వేనెంబర్ 78 లోని ప్రభుత్వ భూమి ఒక 1ఎకరా 50 సెంట్లు భూమిలోనే కూటమి పార్టీ హయాంలోనే జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా కుట్రలు చేస్తున్న వారి పేర్లు త్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోజనసేన సీనియర్ నాయకులు నిడికొండ వెంకట్,బాపట్ల పార్లమెంటరీ ఎస్టీ సెల్ అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు,మండల టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు కూతంబాకం సెల్వం, సంతనూతలపాడు నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొండా శ్రీనివాసరావు, టిడిపి బీసీ సెల్ సీనియర్ నాయకులు ఉప్పుగుండూరు లక్ష్మీనారాయణ,, గద్దె త్యాగరాజు,టిడిపి యూనిట్ ఇంచార్జ్ కుంచాల నాగరాజు, కొప్పర్తి నాగయ్య, మాజీ ఎంపీటీసీ కొండ్రు ఆశీర్వాదం, నల్లూరి భాస్కరరావు,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గద్దె శేషయ్య, కొంజేటి జలంధర్,జాలాది సురేంద్ర,బెల్లం హరిబాబు, యేనిగండ్ల వెంకన్న, టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు గోగులమూడి సింగరయ్య, మాగులూరి రాఘవయ్య, గోగినేని రవి, గోపి, బెల్లంశ్రీనివాసరావు,మిండాల. పూర్ణచంద్రరావు,కత్తి నాగార్జున, దేవరకొండ మురళీకృష్ణ,తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

