డాక్టర్ బూచేపల్లికి అభినందనల వెల్లువ

దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లను నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి అభినందనలు తెలుపు తున్నారు. కార్యాలయంలో అభిమానులు కేకులు తీసు కొచ్చి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి , వెంకాయమ్మలతో కట్ చేయించి ఘనంగా సత్కరించారు. ఉద్యోగ సంఘాలు,ముస్లిం నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుని అభినందనలు తెలిపారు. మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, శీలం శ్రీని వాసరెడ్డి, యరమల మధుసూదన్ రెడ్డి, ఉడుముల వెం కటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, ముప్పరాజు రవి, రహం తుల్లా, చెవిరెడ్డి రాజారెడ్డి, సందిరెడ్డి రాజశేఖరరెడ్డి, దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, మేకల కృష్ణారెడ్డి, రాము, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *