సమన్వయంతో ముందుకు వెళ్తా.. దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి

దర్శి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ క్యాడర్ మొత్తాన్ని కలుపుకెళ్తానని ఆ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. దర్శి లోని బూచేపల్లి నివాసంలో శివప్రసాదరెడ్డిని కలిసేందుకు శని వారం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. తొలుత డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ …ప్రతి నాయకుడు, కార్యకర్త వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి అవసరమని, పార్టీలో ఉన్న వారితో తమకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, అం దరూ వచ్చి కలిసి వెళ్తున్నారని చెప్పారు. నియోజ కవర్గంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా తనను కలవొచ్చన్నారు. రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్యవిభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదన్ రెడ్డి, కోట రామి రెడ్డి ,మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, సోషల్ మీడియా మాజీ కన్వీనర్ ఎన్వీ నాగిరెడ్డి, ముండ్లమూరు జెడ్పీ టీసీ తాతపూడి మోజెస్ రత్నరాజు, బీసీ సెల్ నాయకులు పాశం జయసింహారావు, మాజీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వైస్ చైర్మన్ సద్ది పుల్లా రెడ్డి, గొంది అప్పిరెడ్డి, గోను వెంగళరెడ్డి, నారాయ ణరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *