ప్రకాశం జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పాడిపంటలతో విలసిల్లాలని ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పీవీ శివారెడ్డి ఆకాంక్షించారు. భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుచూ సంక్రాంతి అనేది అతిపెద్ద పండుగగా అభివర్ణించారు సంక్రాంతికి రైతుల ఇళ్లన్నీ పంట రాశులతో కలకలలాడుతూ ఉండేవని ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ సామూహికంగా సంక్రాంతి పండుగను జరుపుకునే వారని వివరించారు.
