తూర్పు గంగవరం పిహెచ్ సి లో డాక్టర్ రత్నంకు ఘన సన్మానం

తూర్పుగంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర స్థాయిలో పేరుతెచ్చుకున్న డాక్టర్ బంకా రత్నంను ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ డైరెక్టర్ గా ఉద్యోగోన్నతి పొంది ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేయనున్న డీఎంహెచ్ ఓ రాజ్యలక్ష్మిని, తూర్పు గంగవరం పీహెచ్లోలో వైద్యునిగా పని చేస్తూ ఉన్నత చదువుల కోసం వెళ్లనున్న డాక్టర్ బీ రత్నంను స్థానిక వైద్య సిబ్బంది గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ ఓ మాట్లాడుతూ… డాక్టర్ రత్నం సేవలను కొనియాడారు. డెంగ్యూ, కరోనా సమయంలో ఆయన సేవలకు గుర్తింపుగా అవార్డులను అందుకున్నారని అన్నారు. అనంతరం డీఎంహెచ్ ఓ రాజ్యలక్ష్మి, బదిలీపై వెళ్లిన డాక్టర్ రత్నం ను వైద్యులు మౌనిక, శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దంత వైద్యులు రమ్య ఎంపీహెచ్ఐవో పి.చంద్రశేఖర్, వైద్యసిబ్బంది సుశీల, మస్తానమ్మ, సురేష్, శిల్పా, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev జూన్ నెలాఖరు వరకు సమ్మర్ కంటిన్జెన్సీ ప్రణాళికను అమలు చేయండి -మంచినీటి సరఫరా,పధకాల నిర్వహణకు నిధుల కొరత లేదు -ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1000 కోట్లు విడుదల చేశాం -సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నిటిని పూర్తిగా నీటితో నింపండి -15 రోజులకు ఒకసారి మండల,జిల్లా స్థాయిలో భూగర్భ జల మట్టాలను పరిశీలించండి-మంచినీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించండి-ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి పనులు ఉ.5.30 గం.లనుండి ఉ.10.30 గం.లలోపు జరిగేలా చూడండి.తాగునీటి సరఫరా,ఉపాధి హామీ పనుల విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వండి-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *