తాళ్లూరు మండలం కొత్తపాలెం గ్రామంలో మూడు
రోజులుగా జ్వరాలు, విరోచనాలతో ప్రజలు బాధపడుతున్నారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యులు షేక్ ఖాదర్ మస్తాన్ బి , రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎక్కువ మందికి నీళ్ల విరోచనాలు కావడంతో ఇంటింటి సర్వే నిర్వహించి ఐవీఆర్
ద్రావణం, యాంటీబయాటిక్స్ ను అందజేశారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు పి.రవికుమార్, ఎమ్ఎల్పీహెచ్వోలు చంద్ర, కార్తీక్, ఏఎన్ఎం పద్మ వెంకట్రామన్,ఆశ, అంజలి, భారతి, సున మ్మ, మరియమ్మ పాల్గొన్నారు.

