జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులలో ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చెయ్యాలని దళిత
హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రం, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్యలు డిమాండ్ చేసారు. శివ రామపురంలో సర్వే నంబర్లో 83/1లో అనపర్తి కుటుంబసభ్యులలో ప్రభు దాస్ కి వచ్చిన వాటా భూమిని వాడపల్లి అంజయ్యకు అమ్మగా అతను వెన్నపూస ఆదిలక్ష్మి అమ్మాడు. అనంతరం వెన్నపూన ఆదిలక్ష్మి హద్దులను తప్పుగా నమోదు చేయించి 2024లో బొగ్గుల కుటుంబానికి రిజిస్టర్ చేయించికుని రహదారి ప్రక్కన ఉన్న మరో 26 సెంట్లను కూడ ఆక్రమించుకుని ఆక్రమ కట్టడాలు కట్టినట్లు ఆరోపించారు. మంగళవారం ఆ స్థలాన్ని పరిశీలించారు. అడ్డుపడిన మాదిగలపై దౌర్జన కాండ నిర్వహించిన బొగ్గుల శ్రీనివాస రెడ్డిని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లయినా మాదిగల గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ల్యాండ్ గ్రాఫింగ్ క్రింద ఆక్రమణ దారులను అరెస్ట్ చెయ్యాలని కోరారు. విఠలాపురంలో యానాదులు భూమిని ఆక్రమించిన వారిని, మేదర మిట్ల పోలీన్ స్టేషన్లో నమోదు అయిన అసభ్య ప్రవర్తన కేసులో నిందుతుడు అజయ్ ను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేసారు.
అనంతరం దర్శి డీస్పీ బాలమురళి కృష్ణని కలిసి మాదిగ ల భూమి అక్రమించిన బొగ్గుల శ్రీనివాస రెడ్డిముఠా పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు.

