జిల్లాలోని పలు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను శాఖ డైరెక్టర్ బి.లావణ్యవేణి సోమవారం పరిశీలించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఆమె ఈ సందర్భంగా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. తొలుత గ్రామంలో ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వ పథకాలు ఉండాలన్నారు. అనంతరం ఆమె ఒంగోలు నగరంలో భాగ్యనగర్‌లో ఉన్న సంక్షేమశాఖ కళాశాల బాలికల వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వసతి గృహంలో విద్యార్థినులకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. విద్యార్థినులు ఉంటున్న గదులను పరిశీలించారు. తాగునీరు, పరిశుభ్రత, భద్రత వంటి విషయాలను పరిశీలించారు.
వసంతుల గురించి విద్యార్థినులు తెలుసుకున్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఈ సందర్భంగా విద్యార్థినులను కోరారు. ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె విద్యార్థినులతో మహిళా కళాశాల ఆవరణలో ఉన్న వసతి గృహం పునరుద్ధరణ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థినులకు త్వరలోనే నైట్ డ్రెస్సులు, టవల్స్, దుప్పట్లు, స్పోర్ట్సు షూష్, పడకలను పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఈ పర్యటనలో ఆమె వెంట జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్, సాహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారులు రబియ, హాస్టల్ వెల్పేర్ అధికారులు శిరీష, శ్రీలత ఉన్నారు.








