పాటిగడ్డ ఫ్లైఓవర్ రూట్ మ్యాప్‌లో మార్పులు.జీ హెచ్ ఎం సి కమిషనర్ కుడాక్టర్ కోట నీలిమ ధన్యవాదాలు.

బేగంపేట జూన్ 29,(జే ఎస్ డి ఎం న్యూస్):
పాటిగడ్డ కాలనీ ప్రజల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదిత పాటిగడ్డ–రసూల్‌పుర జంక్షన్ ఫ్లైఓవర్ మార్గాన్ని పునఃసమీక్షించి, ప్రజలకు నష్టం కలగకుండా రూట్ మ్యాప్‌లో మార్పులు చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌కు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ కోట నీలిమ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ స్థానికులతో వెళ్ళి కమిషనర్‌ను కలిసి ఫ్లైఓవర్ ప్రతిపాదిత మార్గాన్నిపునఃపరిశీలించాలనివినతిపత్రం సమర్పించామన్నారు. ఆ ప్రతిపాదన వల్ల 40 వరకు ఇండ్లు, వారి కుటుంబాలు, వారసత్వ,చారిత్రాత్మక కట్టడాలు
ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించడంతో పాటు స్థానికులు సూచించిన ప్రత్యామ్నాయ రూట్ మ్యాప్‌ను కూడా అధికారులకు అందజేశామని చెప్పారు. ప్రజల ఆందోళనలను సానుకూలంగా స్వీకరించి రూట్ మ్యాప్‌లో తగిన మార్పులు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్పందించి ఫ్లైఓవర్ రూట్ మ్యాప్ మార్చిన సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్‌కు, సంబంధిత అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విశాల్ సూదం, గౌస్, చిరంజీవి, ఒబైద్, సుల్తాన్, నసీర్, రఫిక్, ఇబ్రహీం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *