రైతు సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి పేర్కొన్నారు. సోమవారం కొండపి నియోజకవర్గం, మర్రిపూడి మండలం, రామాయపాలెం గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా డోలా బాల వీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి సాంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించి ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి స్వయంగా నాగలి పట్టి దుక్కి దున్నడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రైతు కష్టాలు తెలిసిన రైతు బిడ్డ రాష్ట్ర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు ముఖంలో ఆనందం చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రైతులకు పెట్టుబడి కష్టాలు రాకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ప్రతి రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ కార్యక్రమం కింద సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2014-15 లో రైతు రధాలు పధకం కింద ట్రాక్టర్లు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తూ యాంత్రీకరణలో భాగంగా రైతుల అవసరాలకు అనువైన యంత్రాలను సబ్సిడీతో ఇవ్వడం జరుగుచున్నదన్నారు. ప్రతి రైతు యూరియాను క్రమపద్దతిలో వినియోగించేలా ఒక యాప్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అలాగే పొలంబడి పిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా రైతులకు అవసరమైన సలహాలను, సూచనలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. అలాగే ఉద్యాన పంటలను ప్రోత్సహించడం జరుగుచున్నదన్నారు. రైతుకు సాగు ఖర్చు తగ్గించి, ఆదాయం పెరిగేలా అన్నీ చర్యలు తీసుకున్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్లు దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద మొత్తంలో అమలు చేస్తున్న ప్రభుత్వం మనదేనని ఆయన తెలిపారు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లుల ఖాతాలలో 13 వేల రూపాయలు చొప్పున నగదు జమజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ, దివ్యాంగ శక్తి పధకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ఎక్కువకావడంతో , వాటి వలన కాన్సర్ వంటి పలు రకాల వ్యాధులకు మనం గురవుతున్నామన్నారు. రసాయనిక ఎరువుల వినియోగం, ముఖ్యంగా యూరియా వినియోగం తగ్గించడంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి ఒక అవార్డు రావడం జరిగిందన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. మర్రిపూడి మండలంలో తాగునీరు, సాగునీటి సదుపాయానికి అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, వ్యవసాయాన్ని రైతుకు లాభసాటిగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక సంప్రాదాయ పద్దతిలో ఈ రోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో నేను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అన్నాడు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న పరిస్థితులకు నేడు వ్యవసాయ రంగంలో నెలకొని వున్న పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. ఆనాడు వ్యవసాయ రంగం నకు సంబంధించి ఏ భూమి కి ఎ పంట వేయాలి, ఎక్కడ మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి, సాగు విధాన, ఎలా చేయాలి అనే సూచనలు, సలహాలు ఇచ్చేవారు లేరని, కేవలం వర్షం పై ఆధారపడి సాగు చేసుకునే వారన్నారు. నేడు ఆ పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. నేడు ప్రతి గ్రామంలో, మండలంలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అధికారులు ఉన్నారన్నారు. వారి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతన్న మీ కోసం కార్యక్రమం కింద ఏ కాలంలో ఏ పంట పండించాలి, ఏ పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుచున్నదన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పద్దతులు, ఆధునిక పద్దతుల్లో ఎక్కువ శాతం పురుగు మందులు, రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువైందన్నారు. యూరియాను ఎక్కువగా వాడటం వలన అనేకరకమైన నష్టాలు ఉన్నాయని, క్యాన్సర్ కు ముఖ్యమైన కారణమేమంటే యూరియా, యూరియా వాడకంను తగ్గించాలంటే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయంను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రైతు తన పొలంలో కనీసం 10 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లయితే మార్పుకు శ్రీకారం చుట్టినవారౌతారని కలెక్టర్ అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులను ప్రతి రైతుకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్ధిక తోడ్పాటు కల్పించడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని ఆర్దికాభివృద్ది సాధించాలన్నారు.
తొలుత ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ఆవశ్యకతను, జిల్లా లో వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను వ్యవసాయ శాఖ జెడి శ్రీనివాస రావు వివరించారు.
ఈ సందర్భంగా సిఎంఆర్ చెక్కులను, రైతులకు సబ్సిడీ తో నవధాన్యాల కిట్ లను అందచేయడం జరిగింది.
అంతకు ముందు గ్రామంలో 45 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, సైడు కాలువలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశి, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ తిరుపతమ్మ, పశు సంవర్ధక శాఖ జెడి వెంకటేశ్వర రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపి చంద్, ఎపిఎంఐపి పిడి శ్రీనివాస రావు, సెరికల్చర్ శాఖాధికారి డా. సుజయ్, పకృతి వ్యవసాయ అధికారి శ్రీమతి సుభాషిని, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












