హైదరాబాద్ జూన్ 28,( జే ఎస్ డి ఎం న్యూస్) :
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105 వ జయంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమి లో ఆదివారం పలు పార్టీ లకు చెందిన నేతలు నివాళులు అర్పించారు కేంద్రమంత్రి గంగా పురం కిషన్ రెడ్డి ,మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తో కలిసి పి.వి.కి నివాళులు అర్పించారు. తెలంగాణా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్
కుమార్,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ,ఇతర ముఖ్య నేతలు పి.వి.కి నివాళులు అర్పించారు.మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూతెలంగాణ ముద్దుబిడ్డ, భారతరత్న, మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి, దూరదృష్టి గల మహానేత పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులుఅర్పిస్తున్నాఅన్నారు.పీవీ నరసింహారావు కేవలం తెలంగాణ కె కాదు,యావత్ భారతదేశానికి మార్గదర్శకులు. అన్నారు.దేశం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ధైర్యవంతమైన నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారన్నారు.
నేడు ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి ఆయన వేసిన పునాదులు ఎంతో కీలకమైనవనీ అన్నారు.రాజకీయ నాయకుడిగా, పరిపాలనాదక్షుడిగా, సాహితీవేత్తగా, బహుభాషా కోవిదుడిగా పీవీ అనేక రంగాల్లో అసాధారణ ప్రతిభను కనబరిచారన్నారు.జ్ఞానం, వినయం, దూరదృష్టి కలిసిన అరుదైన వ్యక్తిత్వం ఆయనదన్నారు.
పీవీ నరసింహారావు సేవలను చిరస్థాయిగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆయన స్ఫూర్తిని భావితరాలకు చేరవేస్తోందన్నారు.
నేటి యువత పీవీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నిరంతర అధ్యయనం, క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజాసేవ పట్ల అంకితభావంతో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని ఆయన జీవితం మనకునేర్పుతోందన్నారు.పీవీ నరసింహారావు ఆశయాలు, విలువలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. ఆయన చూపిన అభివృద్ధి, సంస్కరణలు, సమర్థవంతమైన పాలన మార్గంలో తెలంగాణ నడుస్తుందనీ మంత్రి పొన్నం పేర్కొన్నారు.పి.వి కి నివాళులు అర్పించిన వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , కే.కేశవరావు,మాజీ స్పీకర్ మధుసూదనాచారీ,పి.వి.కుటుంబ సభ్యులు స్వామి రామానంద పాఠశాల విద్యార్థులు, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.





