సికింద్రాబాద్ జూన్ 28 (జే ఎస్ డి ఎం న్యూస్)
మహానగరంలో ఆకలితోఅలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా స్కై ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 303వ అన్నదానకార్యక్రమాన్ని నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు ప్రత్యేక వాహనంలో నగరంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ, రోడ్ల పక్కన మరియు ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారిని గుర్తించి వారికి ఎంతో ప్రేమతో ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సుదీర్ఘ సేవా కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పావని.ఓ తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. సమాజంలో వెనుకబడిన వారికి అండగా నిలుస్తూ ఫౌండేషన్ చేస్తోన్న ఈ సేవా కార్యక్రమాలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

